ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
Wednesday, August 20, 2025 03:44 PM Crime
మహారాష్ట్రలోని జల్గావ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలంలో పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులు కరెంట్ షాక్ తో మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఆరేళ్ల బాలిక, ఎనిమిదేళ్ల బాలుడు, మరో వ్యక్తి ఉన్నారు. అయితే ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



