బస్సులో అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తి.. తనిఖీ చేస్తే షాకింగ్ విషయాలు
బస్సులో అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా రెండు ఏనుగు దంతాలు బయటపడ్డాయి. వాటి విలువ సుమారు రూ. 3 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. కాగా నిందితులు శేషాచలం అడవుల నుంచి ఏనుగు దంతాలు తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయానికి యత్నించినట్లు తెలిసింది. పట్టుబడ్డ నిందితుడి పేరు మహర్షి అని తేలింది. రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ దంతాల విలువ రూ.3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
నిందితుడు ఏపీకి చెందిన రేకులకుంట ప్రసాద్ (మహర్షి) ని అరెస్ట్ చేశారు. నగరంలో ఏనుగు దంతాల బిజినెస్ నడుస్తుందన్న అటవిశాఖ అధికారుల ఫిర్యాదు మేరుకు రాచకొండ ఎస్ఓటి పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులు జాయింట్ ఆపరేషన్ తో ఈ ముఠాను పట్టుకున్నారు. ప్రసాద్ తిరుపతి జిల్లాలోని శేషాచలం ఫారెస్ట్ నుంచి ఏనుగు దంతాలు తీసుకువచ్చాడని తెలిపారు.



