ఢీ షో డ్యాన్సర్ కళ్యాణి ఆత్మహత్య

ఢీ షో కు చెందిన డాన్సర్ కావ్య కళ్యాణి (24) ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో కావ్యకళ్యాణి (24) ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణానికి ‘ఢీ' షో డాన్సర్ అభి కారణం అంటూ తన సెల్ఫీ వీడియోలో తెలిపింది.
ఆత్మహత్యకు ముందు కావ్యకళ్యాణి ఒక వీడియో రికార్డ్ చేసి తన బాధను వెల్లడించింది. “నాకు న్యాయం జరగాలి. నేను చచ్చిపోబోతున్నాను.. నా చావుకి కారణం అభి. 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లాడు. కానీ, నన్ను ఇప్పుడు నన్ను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు” అని కన్నీటి పర్యంతం అవుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ విషాదకర ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు నిందితుడు అభిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ సంఘటన ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.