ఎంత కష్టం వచ్చిందో.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై దంపతుల ఆత్మహత్య

Tuesday, March 11, 2025 01:00 PM Crime
ఎంత కష్టం వచ్చిందో.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై దంపతుల ఆత్మహత్య

ఎంత కష్టం వచ్చిందో ఏమో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆపై దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (40), కవితారెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర్‌నగర్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదవ తరగతి చదువుతున్న విశ్వంత్‌రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చంద్రశేఖర్‌రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాడు. గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్‌ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్‌రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్‌ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కన్పించారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కన్పించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్‌లోని ఫిట్జీ స్కూల్లో, విశ్వంత్‌ హబ్సిగూడలోని జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: