మస్తాన్ సాయి, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్

Wednesday, February 12, 2025 02:17 PM Crime
మస్తాన్ సాయి, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్

లావణ్యతో నార్సింగ్ డిటేక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తరచూ వాట్సాప్‌లో వీడియో కాల్స్ మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విచారణలో డిఐ శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడింది నిజమే అని తేల్చే. అతనిని ఐజి ఆఫీసుకు అటాచ్ చేశారు. లావణ్య నటుడు రాజ్ తరుణ్‌పై పిర్యాదు చేసినప్పటి నుంచి శ్రీనివాస్‌తో ఆమె పరిచయం పెరిగింది. తరచూ ఇద్దరూ ఫోన్లో వీడియో కాల్స్, ఆడియో కాల్స్ మాట్లాడుకున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో శ్రీనివాస్‌పై చర్యలు తీసుకున్నారు.

కేసు విచారణ సమయంలో లావణ్య ఇంటికి వెళ్లిన శ్రీనివాస్‌ ఆమెతో కుమ్మక్కై కేసును తప్పుదోవ పట్టించినట్లు ప్రాథమిక సమాచారం అందడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మస్తాన్‌ సాయి అరెస్టు తర్వాత ఆడియో టేపుల లీకులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఒక్కో ఆడియో టేపులో ఒక్కో విషయం ఉండడంతో సోషల్‌ మీడియాలో సంచలనంగా మారుతోంది. తాజాగా డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ బదిలీ కావడం వీటి ప్రభావమేనని తెలుస్తోంది. మస్తాన్‌ సాయి నుంచి స్వాధీనం చేసుకున్న హర్డ్‌డిస్క్‌లో నగ్న వీడియోలు, ఫొటోలతో పాటు ఆడియో క్లిప్‌లు కూడా ఉన్నట్లు సమాచారం.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: