బెంగళూరు వ్యాపారవేత్తను, ఆయన కుమారుడిని ఏపీలో గొంతుకోసి చంపిన దుండగులు

Thursday, July 24, 2025 02:30 PM Crime
బెంగళూరు వ్యాపారవేత్తను, ఆయన  కుమారుడిని ఏపీలో గొంతుకోసి చంపిన దుండగులు

బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్తను ఆయన కొడుకును ఆంధ్రప్రదేశ్‌లో కిడ్నాప్ చేసి హత్య చేశారు. బెంగళూరులోని కడుగోడికి చెందిన వీరస్వామి రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరు కావడానికి ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాకు వెళ్లారు. 

కోర్టు ప్రాంగణానికి సమీపంలోని టిఫిన్ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వారిద్దరినీ కిడ్నాప్ చేశారు. అనంతరం వారి గొంతులు కోసి తరువాత వారి మృతదేహాలను పొరుగున ఉన్న బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు సమీపంలో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రశాంత్ రెడ్డి బిజెపి యువ మోర్చాలో, ఆ పార్టీ యువజన విభాగంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. వారిని ప్లాన్ చేసి చంపినట్లు తెలుస్తోంది. దీనిపై పల్నాడు, బాపట్ల జిల్లాల పోలీసులు సంయుక్త దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులను గుర్తించే ప్రక్రియలో ఉన్నారు. కిడ్నాప్‌కు ఉపయోగించిన వాహనాన్ని ట్రాక్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: