రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో ట్విస్ట్.. హత్యకు ప్లాన్

Thursday, February 6, 2025 10:15 PM Crime
రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో ట్విస్ట్.. హత్యకు ప్లాన్

యువతుల ప్రైవేట్ వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రావి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు ఫిబ్రవరి 3న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు పేర్కొన్నారు. మస్తాన్ సాయితో పాటు ఆర్ జే శేఖర్ బాషాపై మన్నెపల్లి లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 4న ఫిర్యాదు చేశారు. రావి మస్తాన్ సాయిపై లావణ్య ఫిబ్రవరి 2న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల ప్రైవేట్ వీడియోలు సేకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో పాటు ఓ హార్డ్ డిస్క్ ను కూడ ఆమె పోలీసులకు సమర్పించారు. ఈ హార్డు డిస్క్ లో మహిళలకు చెందిన ఫోటోలు, వీడియోలున్నాయని తెలిపారు. ఈ హర్డ్ డిస్క్ కోసం తనపై దాడి చేసేందుకు తన ఇంటికి వచ్చారని మస్తాన్ సాయి, ఖాజాపై ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మస్తాన్ సాయి, ఖాజాలపై బీఎన్ఎస్ 329(4),324(4),109,77,78 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 4న మస్తాన్ సాయితో పాటు ఖాజాను హైదరాబాద్ నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను పేర్కొన్నారు. ఉనీత్ రెడ్డి అనే ఫ్రెండ్ ద్వారా మస్తాన్ సాయితో లావణ్యకు పరిచయం ఏర్పడింది. ఓ ఫంక్షన్ సందర్బంగా మస్తాన్ సాయి ఇంటికి వెళ్లింది లావణ్య. ఆ సమయంలో ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియో తీశారు. ఈ వీడియోలను తన ఫ్రెండ్స్ కు కూడా అతను షేర్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. దీంతో లావణ్య మస్తాన్ సాయితో గొడవకు దిగింది. ఈ విషయాన్ని అప్పట్లో రాజ్ తరుణ్ రాజీ చేశారని పోలీసులు తెలిపారు. మస్తాన్ సాయి వద్ద ఉన్న ఐపాడ్ లో ఉన్న వీడియోలను రాజ్ తరుణ్ డిలీట్ చేయించారు. అయితే అప్పటికే ఆ వీడియోలను మస్తాన్ మరొక హార్డ్ డిస్క్ లో భద్రపర్చారు.ఈ హర్డ్ డిస్క్ ను 2024 నవంబర్ లో లావణ్య మస్తాన్ సాయి ఇంటి నుంచి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ హర్డ్ డిస్క్ కోసం మస్తాన్ సాయి లావణ్యను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిలో డ్రగ్స్ ఆనవాళ్లు లభించాయని పోలీసులు ఆ రిపోర్టులో తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: