మలక్ పేటలో మరో గురుమూర్తి.. భార్యను చంపి...

హైదరాబాద్ మలక్ పేటలో మరో గురుమూర్తి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాదర్ఘాట్ పరిధిలో భార్యను దారుణంగా టార్చర్ చేసి హతమార్చిన ఓ భర్త ఆ తర్వాత ఆమె గుండె పోటుతో చనిపోయిందంటూ డ్రామా మొదలుపెట్టాడు. ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరకోకముందే అంబులెన్సులో మృతదేహాన్ని సొంత గ్రామం తరలిస్తుండగా అడ్డంగా బుక్ అయ్యాడు.
శ్రీశైలం సమీపంలోని దోమల పెంటకు చెందిన శిరీష, వినయ్ కుమార్ దంపతులు ఓల్డ్ మలకపేట జమున టవర్స్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం శిరీషకు గుండెపోటు వచ్చి ఇంట్లోనే చనిపోయిందంటూ వినయ్ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పేరెంట్స్ మృతదేహంపై గాయాలు కనిపించడంతో కొట్టి చంపినట్లు గుర్తించారు. గుండెపోటు అని కథ అల్లుతున్నాడంటూ వెంటనే చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినయ్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజంగానే గుండెపోటుతో ఆమె చనిపోయిందా లేక వినయ్ ఆమెను కొట్టి చంపేశాడ అనేది దర్యాప్తులో వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.