విషాదం: 12 మంది మృత్యువాత

Wednesday, June 18, 2025 01:00 PM Crime
విషాదం: 12 మంది మృత్యువాత

బీహార్ లో ఈదురు గాలులు, ఉరుముల మెరుపులు, పిడుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే పిడుగుల ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బిహార్ సీఎం నీతీశ్ కుమార్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. మృతులకు సీఎం సంతాపం తెలిపారు. ప్రతికూల వాతావరణంలో ప్రజలు పూర్తి జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం వెంటనే అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

వర్షాకాలం ఈ ప్రాంతాల్లో అనూహ్య వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, భద్రతా సలహాలను పాటించాలని అధికారులు కోరారు. ప్రభుత్వం కూడా పరిస్థితిని చురుగ్గా పర్యవేక్షిస్తోందని.. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తోందని అధికారులు పేర్కొన్నారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: