వెహికల్ నెంబర్ ప్లేట్స్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం

Saturday, July 18, 2020 11:58 AM Automobiles
వెహికల్ నెంబర్ ప్లేట్స్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం

అనేక రాష్ట్రాల్లో, వివిధ వాహనాల్లో ఉపయోగించే నెంబర్ ప్లేట్ల గురించి కొంత గందరగోళం నెలకొంది. దీనిని గమనించి కేంద్ర ప్రభుత్వం ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని అన్ని రాష్ట్ర రవాణా శాఖలను ఆదేశించింది. అస్పష్టతను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం గురువారం వివిధ రంగుల నెంబర్ ప్లేట్లకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది.

బ్యాటరీతో నడిచే వాహనాలపై గ్రీన్ నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయాలనీ కేంద్ర ప్రభుత్వం నోటీసు జారీ చేసింది, దానిపై ఆ నెంబర్ మాత్రం పసుపు రంగుతో గుర్తించబడుతుంది. అదే సమయంలో, తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలపై పసుపు నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయబడతాయి, దానిపై ఆ సంఖ్య ఎరుపు రంగులో వ్రాయబడుతుంది. డీలర్షిప్ వద్ద ఉన్న వాహనాలపై ఎరుపు రంగు నెంబర్ ప్లేట్లు ఉంచడం తప్పనిసరి, దానిపై తెలుపు రంగులో వ్రాయబడిన సంఖ్యలు ఉంటాయి.

కొత్త వాహనాల్లో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అన్ని రకాల కొత్త వాహనాల్లో క్రోమ్ స్టిక్కర్ నెంబర్ ప్లేట్లు ఉంటాయి. వాహనం దొంగిలించబడినప్పుడు ఈ నెంబర్ ప్లేట్ మార్చడం కష్టం. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

For All Tech Queries Please Click Here..!