నేడు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం
ఏపీలోని పలు జిల్లాల్లో నేడు (ఆదివారం) ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని APSDMA వెల్లడించింది. మరో వైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని తెలిపింది. కూలీలు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే శనివారం అత్యధికంగా కర్నూలు జిల్లా ఆస్పరి, సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.