ముందుగానే నైరుతి రుతుపవనాలు
ఈసారి దేశంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నాయి. జూన్ 1 కంటే ముందుగా మే 27న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నేడు ప్రకటించింది. గతేడాది మే 30న రాగ.. 2023 జూన్ 8న, 2022 మే 29న నైరుతి ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.