ప్రభుత్వ హెచ్చరిక: నేడు ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త
రాష్ట్ర వ్యాప్తంగా నేడు (మంగళవారం) పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి జిల్లా కూనవరం, వరరామచంద్రపురం, వేలేర్పాడు, మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట, లక్ష్మీనర్సుపేట, బూర్జ, హీరా మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయంది.
అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 62 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఆయా మండలాల ప్రజలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం మంచిది.