12 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మొత్తం 12 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి త్వరగానే వస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా.. రేపు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.