అలెర్ట్: రాయలసీమ ప్రజలు జాగ్రత్త
రానున్న రెండు రోజుల పాటు రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు 38 °C నుంచి 40°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. హోర్డింగ్స్, చెట్లకింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వద్ద నిల్చోవద్దని సూచించారు.