వాతావరణ హెచ్చరిక: ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు
తెలంగాణాలో మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.