అలెర్ట్: నేడు 49 మండలాల్లో వడగాలులు
ఏపీ: రాష్ట్రంలోని నేడు (శుక్రవారం) 49 మండలాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ (APSDMA) వెల్లడించింది. వడగాలులు వీచే మండలాల్లో శ్రీకాకుళం జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 16, మన్యం జిల్లాలో 13, అల్లూరి జిల్లాలో 1, కాకినాడ జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాలు ఉన్నాయని తెలిపింది.
ఆ మండలాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు ఆదివారం రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.