నేడు రాష్ట్రంలో భిన్న వాతావరణం
ఏపీలో ఈ రోజు భిన్న వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.
మిగతా జిల్లాల్లో ఎండలు మండిపోతాయని పేర్కొంది. భిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు వర్షాలు, ఇటు ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.