రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు
ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. సోమవారం, మంగళవారం రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు 41.5 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.