రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు
ఏపిలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటుంటున్నాయి. ఓ వైపు భానుడు భగభగమని నిప్పుల కొలిమితో మండిపోతుంటే, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు శ్రీకాకుళం-1, విజయనగరం-10, పార్వతీపురం మన్యం -7, అల్లూరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.