నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సిద్ధిపేట, యాదాద్రి, ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో గాలివానలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.