ఈ మూడు రోజులు జాగ్రత్త.. ప్రభుత్వ హెచ్చరిక
తెలంగాణాలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.