నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు
శనివారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా అరకబద్రలో 43.7మిమీ, శ్రీసత్యసాయి జిల్లా కల్లుకుంటలో 30.7మిమీ, శ్రీకాకుళం జిల్లా రాజాపురంలో 26.2మిమీ, ఇచ్చాపురంలో 22.2మిమీ వర్షపాతం రికార్డయిందన్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా గంగుడుపల్లిలో 39.8 °C, నెల్లూరు జిల్లా మనుబోలులో 39.4 °C, అన్నమయ్య జిల్లా నల్లతిమ్మాయిపల్లిలో 39.2°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.