నేడు, రేపు జాగ్రత్త.. ప్రభుత్వం హెచ్చరిక

Weather Published On : Wednesday, March 19, 2025 08:00 AM

ఏపీలో మార్చి మూడో వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. నేడు 58 మండలాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSMDA) వెల్లడించింది. రేపు 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.

ప్రజలు వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా చూసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా ORS, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచించింది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...