ఈ రోజు బయటకు అస్సలు వెళ్ళకండి..
ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు(గురువారం) తీవ్ర వడగాల్పులు వీస్తాయని APSDMA హెచ్చరించింది. మరికొన్ని చోట్ల వడగాల్పులు వీస్తాయని తెలిపింది. అల్లూరి జిల్లా అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, రంప చోడవరం మండలాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది.
అలాగే, పలు జిల్లాల్లోని 143 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA జాబితా విడుదల చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండకు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.