నేడు అసలు బయటకు రాకండి.. ప్రభుత్వం హెచ్చరిక
ఏపీలోని 126 మండలాల్లో ఈ రోజు (ఆదివారం) వడగాలులు వీస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో 20, విజయనగరం జిల్లాలో 23, మన్యం జిల్లాలో 13, అల్లూరి జిల్లాలో 7, విశాఖ జిల్లాలో 1, అనకాపల్లి జిల్లాలో 11, కాకినాడ జిల్లాలో 7, కోనసీమ జిల్లాలో 7, తూర్పుగోదావరి జిల్లాలో 19, పశ్చిమగోదావరి జిల్లాలో 2, ఏలూరు జిల్లాలో 7, ఎన్టీఆర్ జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 2, పల్నాడు జిల్లాలోని 2 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది.
అలాగే అల్లూరి జిల్లా చింతూరులో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు ఎండ వేడిమికి తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించింది. అవసరం అయితే తప్ప బయట తిరగకూడదని హెచ్చరించింది.