UPI వినియోగదారులకు గుడ్ న్యూస్
ఇటీవల రోజుల్లో తరచుగా ఒక చిన్న పొరపాటు వల్ల డబ్బు తప్పు ఖాతాలోకి వెళ్లిపోతుంది. దానిని తిరిగి పొందడం కష్టమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త అప్డేట్ తీసుకువచ్చింది. దీని ప్రకారం ఇప్పుడు ఎవరైనా UPI ద్వారా డబ్బు పంపినప్పుడు ట్రాన్సాక్షన్ స్క్రీన్పై రిసీవర్ పేరు బ్యాంక్ రికార్డులలో నమోదైన పేరుగా కనిపిస్తుంది. ఈ నియమం జూన్ 30 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది.