ప్రపంచకప్-2025 : భారత్ ఘన విజయం

Sports Published On : Sunday, February 2, 2025 03:57 PM

భారత జట్టు ప్రపంచకప్ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. అండర్-19 ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ లో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 82 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి త్రిష 33 బంతుల్లో 44 చేసింది. భారత్ 11.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.