యుద్ధ ప్రభావం: IPL ఆగిపోతుందా?
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం IPLపై పడనుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ బీసీసీఐ స్పందించనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా కొనసాగుతుందని, ఆపరేషన్ సింధూర్ ప్రభావం మ్యాచులపై పడకపోవచ్చని బీసీసీఐ చెప్పినట్లు ANI వెల్లడించింది. అయితే పాక్ సరిహద్దు రాష్ట్రం పంజాబ్ లో జరిగే మ్యాచులు ఢిల్లీకి మారే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి.