రేపే ఫైనల్.. విరాట్ కోహ్లీకి గాయం..
ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు (ఆదివారం) న్యూజిలాండ్ తో భారత్ తుది సమరానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ కీలక సమయంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయపడ్డారు. ప్రాక్టీస్ లో పేసర్ను ఎదుర్కొనే క్రమంలో కోహ్లి మోకాలికి గాయమైందని Geo News రిపోర్ట్ చేసింది.
దీంతో వెంటనే ట్రైనింగ్ ఆపేశారని, ఫిజియో స్ప్రే కొట్టి, బ్యాండేజ్ వేశారని ఆ వార్తలో పేర్కొంది. అయితే కోహ్లి ఫైనల్ ఆడేందుకు ఫిట్ గానే ఉన్నారని కోచింగ్ స్టాఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో విరాట్ మ్యాచ్ ఆడే అవకాశం కనిపిస్తోంది.