ఇండియా జట్టు స్వదేశీ షెడ్యూల్ విడుదల
ఇండియా క్రికెట్ జట్టు ఈ ఏడాది స్వదేశంలో ఆడే సిరీస్ షెడూల్ ను BCCI విడుదల చేసింది. వెస్టిండీస్ తో అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్, అదే నెల 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ ఆడనుంది. సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్, 22 నుండి 26 వరకు రెండో టెస్ట్ జరగనుంది. నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో వన్డేలు నిర్వహించనున్నారు. 5 మ్యాచుల టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి 19 వరకు జరగనుంది. 9, 11, 14, 17, 19 తేదీల్లో ఈ మ్యాచులు జరగనున్నాయి.