ఛాంపియన్స్ ట్రోఫీ: సౌతాఫ్రికా ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ తో శనివారం జరిగిన మ్యాచులో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని 29.1 ఓవర్లలో ఛేదించింది.
ఆ జట్టు బ్యాటర్లలో డస్సెన్ 72 పరుగులతో, క్లాసన్ 64 పరుగులతో రాణించారు. ఇప్పటికే సౌతాఫ్రికాకు సెమీస్ బెర్తు ఖరారు అయింది. ఇంగ్లండ్ ఒక్క విజయం కూడా లేకుండానే నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.