HELO లైవ్‌లో సెహ్వాగ్‌ గొడవపై స్పందించిన అక్తర్

Sports Published On : Sunday, May 10, 2020 09:58 PM

2019 ప్రపంచకప్ ఓటమి తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే బాగుండేదని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం HELO లైవ్‌లో అక్తర్ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

 మోడ్రన్ డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారాల వంటి దిగ్గజ క్రికెట్లను చూడలేకున్నామని.... దీంతో పాటు క్వాలిటీ ఆఫ్ క్రికెట్ కూడా తగ్గిందని అక్తర్ తెలిపాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టడం సాధ్యమేనా? అని అడిగిన ప్రశ్నకు... ప్రస్తుతం విరాట్ కోహ్లీ చాలా దూకుడుగా ఆడుతున్నాడని.... 

సచిన్ 100 సెంచరీల రికార్డుని విరాట్ కోహ్లీ అధిగమిస్తాడని... కోహ్లీ 120 సెంచరీలు ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అక్తర్ తెలిపాడు. ఎందుకంటే అతడు కృత నిశ్చయంతో ఆడుతున్నాడని అక్తర్ చెప్పాడు. సెహ్వాగ్‌‌తో చోటు చేసుకున్న వివాదంపై(బాప్ బాప్ హోతా హై, బీటా బీటా హోతా హై) కూడా అక్తర్ స్పందించాడు. 

 ఛాంపియన్స్ ట్రోఫీలో చెత్త మాట్లాడొద్దని... ఈరోజు ఫాదర్స్ డే అని... కిడ్‌గా నీ గురించి మేము కేర్ తీసుకుంటామని సెహ్వాగ్‌తో అన్నానని అక్తర్ చెప్పాడు. సెహ్వాగ్, గంభీర ఇద్దరూ మంచి వ్యక్తులని తెలిపాడు. కానీ, వారు టీవీలో వచ్చి వారి నోటికి ఎప్పుడైనా వస్తారని చెప్తారని... తాను కూడా వారిపై చెడు మాటలు చెప్పగలనని..... కానీ తాను అలాంటి విషయాలు చెప్పనని అక్తర్ అన్నాడు. ఎందుకంటే చిన్న పిల్లలు టీవీ షోలు చూస్తారని అక్తర్ అన్నాడు.