ఐపీఎల్: ముంబై ఇండియన్స్ కు షాక్..!
ఐపిఎల్ లో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచులో ముంబైకు ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం కానున్నారు. బుమ్రా గాయం ఇంకా తగ్గలేదని, కోలుకునేందుకు మరింత సమయం పట్టవచ్చని కోచ్ జయవర్ధనే స్పష్టత ఇచ్చారు.
నిషేధం కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా తొలి మ్యాచుకు దూరమయ్యా రు. అతడి స్థానంలో సూర్య కెప్టెన్సీ చేయనున్నారు. గత కొన్ని సీజన్లుగా ఫస్ట్ మ్యాచ్ ఓడుతూ వస్తోన్న ముంబై ఈ స్టార్ ప్లేయర్లు లేకుండా ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందే.