2027 వరల్డ్ కప్ ఆడటంపై స్పందించిన రోహిత్ శర్మ
2027 వరల్డ్ కప్ ఆడటంపై టీం ఇండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్పందించారు. తాను ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం జట్టులో కొనసాగాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. '2027 వన్డే వరల్డ్ కప్ కు ఇంకా చాలా సమయం ఉంది. ఆ టోర్నీలో ఆడతానో లేదో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను." అని తెలిపారు.
ప్రస్తుతం నేను బాగా ఆడుతున్నా. టీమ్ కూడా నాతో ఆడటాన్ని ఇష్టపడుతోంది. ప్రస్తుతం జట్టు ఆడుతున్న తీరును చూస్తుంటే ఈ జట్టును వదలాలని అనిపించడం లేదని వెల్లడించారు.