హిట్ మ్యాన్ సరికొత్త రికార్డు
SRHతో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ శర్మ టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. 456 మ్యాచుల్లో హిట్మ్యాన్ ఈ ఘనత సాధించారు. ఈ 12K T20 క్లబ్లో కోహ్లి తర్వాత చోటు దక్కించుకున్న రెండో భారత ప్లేయర్గా రికార్డ్ సృష్టించారు. ఓవరాల్ T20 క్రికెట్లో 8వ ప్లేయర్ గా నిలిచారు. 12వేలు పరుగులు చేసిన లిస్టులో గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, పోలార్డ్, కోహ్లి, డేవిడ్ వార్నర్, జోష్ బట్లర్ ఉన్నారు.