విరాట్ కోహ్లి రిటైర్ మెంట్ కు కారణమిదే?
రన్ మిషన్ విరాట్ కోహ్లి ఇటీవల టెస్ట్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం క్రికెటర్ అభిమానులను ఎంతగానో నిరాశకు గురిచేసింది. అయితే దీనిపై పలు కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టెస్టు క్రికెట్ లో విరాట్ కు కేప్టెన్సీ బాధ్యతలు ఇస్తామని బీసీసీఐ హామీ ఇచ్చిందని, అలా జరగకపోవడంతో విరాట్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికినట్లు వార్తలు వస్తున్నాయి.