IPL 2025: ఉత్కంఠ పోరులో RCB గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠ పోరులో RCB విజయం సాధించింది. 2 పరుగుల తేడాతో సొంత గడ్డపై సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. అయితే 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నె 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులకు పరిమితమైంది.