నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం

Sports Published On : Thursday, May 15, 2025 10:32 AM

భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను భారత సైన్యం ప్రధానం చేసింది ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. నీరజ్ కొత్త ర్యాంక్ ఏప్రిల్ 16, 2025 నుండి అమల్లోకి వచ్చింది. గత రెండు ఒలింపిక్స్ టోర్నీలో జావెలిన్ త్రో భారత్కు వరుసగా గోల్డ్, సిల్వర్ మెడల్స్ని సాధించాడు.