IPL 2025: పంజాబ్ కుదేలు.. రాజస్థాన్ ఘన విజయం
IPL 2025లో భాగంగా PBKSతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ 155/9 స్కోరుకే పరిమితమైంది. నెహాల్ వధేరా 62 పరుగులు, మ్యాక్స్వెల్ 30 పరుగులు చేశారు. వారిద్దరు మినహా జట్టులో అందరూ విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ 3, సందీప్ శర్మ, తీక్షణ చెరో 2 వికెట్లు, కుమార్ కార్తికేయ, హసరంగ చెరో వికెట్ తీశారు. ఈ సీజన్లో పంజాబ్ కు ఇదే తొలి ఓటమి.