IPL 2025: మళ్లీ మొదటి నుంచి పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్
భద్రత కారణాల రీత్యా మే 8న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ BCCI రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే పంజాబ్ 10.1 ఓవర్ల ఇన్నింగ్స్ సమయంలో మ్యాచ్ రద్దయింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మే 17 నుంచి IPL మ్యాచ్ లు తిరిగి ప్రారంభం కానున్నాయి. మే 24న జైపూర్ వేదికగా పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను మళ్లీ మొదటి నుంచి అధికారులు నిర్వహించనున్నారు.