IPL 2025: పంజాబ్ సంచలన విజయం
ఐపీఎల్ లో నేడు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 111 పరుగులు చేసింది. దీంతో ఇంకేముంది కోల్కతాదే విజయమని అందరూ ఫిక్సైపోయారు. కానీ పంజాబ్ జట్టు అలా భావించలేదు. సాయశక్తులా పోరాడింది. 95 పరుగులకే కోల్కతాను మట్టి కరిపించింది. ఇంత తక్కువ స్కోరింగ్ మ్యాచ్లోనూ 16 పరుగుల తేడాతో గెలిచి మజా ఇచ్చింది. ఆ జట్టు బౌలర్లలో చాహల్ 4 వికెట్లతో KKR వెన్నువిరిచి హీరోగా నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోరును విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ నిలిచింది.