ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్ పోరుకు పిచ్ సిద్ధం
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు పిచ్ ఏర్పాటు పూర్తయింది. లీగ్ దశలో భారత్-పాకిస్థాన్ ఆడిన పిచ్నే క్యూరేటర్లు తుది సమరానికి సిద్ధం చేసినట్లు సమాచారం.
ఆ మ్యాచులో పాక్ 244 రన్స్ చేయగా భారత్ ఘన విజయం సాధించింది. ఇది వరకు భారత్ మ్యాచులన్నీ కొత్త పిచ్లపైనే ఆడగా ఫైనల్ దీనిపై ఆడనుంది. అయితే దుబాయ్ లో ఆడటం ఇండియాకు కలిసి వస్తోందని పలు దేశాల క్రికెటర్లు విమర్శలు చేస్తున్న సంగతి విదితమే.