IPL 2025: SRHపై ముంబై ఘన విజయం

Sports Published On : Thursday, April 17, 2025 11:23 PM

IPL 2025లో భాగంగా వాంఖడేలో SRHతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లు రోహిత్ 26, రికెల్టన్ 31 పరుగులతో శుభారంభం అందించారు. విల్ జాక్స్ 36 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 26 పరుగులతో రాణించారు. చివర్లో తిలక్, హార్దిక్ బౌండరీలతో మెరిపించారు. తాజా గెలుపుతో ఈ సీజన్లో 7 మ్యాచుల్లో MI మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...