KL రాహుల్ సంచలన నిర్ణయం!
ఐపిఎల్ లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న KL రాహుల్ తన కెప్టెన్సీపై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించొద్దని టీం యజమానికి చెప్పినట్లు సమాచారం.
దీంతో ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ కెప్టెన్ అవడం లాంఛనమే కానుంది. ఇన్నాళ్లు రాహుల్, అక్షర్లలో ఎవరు కెప్టెన్ అవుతారనే ప్రశ్న తలెత్తింది. తాజా నిర్ణయంతో ఆ ప్రశ్నకు సమాధానం దొరికినట్లయింది.