వన్డే మ్యాచ్ లలో కీలక మార్పులు
వన్డే క్రికెట్ మ్యాచ్ లలో కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లలో బౌలింగ్ కు కూడా ప్రాముఖ్యం ఉండేలా మొత్తం మాచ్ అంతా ఒకే బంతితో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. పదేళ్లకు పైగా కొనసాగుతున్న రెండు కొత్త బంతుల పద్ధతిని ఐసీసీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నేతృత్వంలో ఐసీసీ క్రికెట్ కమిటీకి కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.