స్టార్ క్రికెటర్ కు డోపింగ్ కేసులో ఊరట
దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడాకు డోపింగ్ కేసులో ఊరట లభించింది. నిషేధిత ఉత్ప్రేరకాల వినియోగానికి సంబంధించిన రీహాబిలేషన్ కార్యక్రమాన్ని రబాడా విజయవంతంగా పూర్తి చేయడంతో, దక్షిణాఫ్రికా ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రగ్-ఫ్రీ స్పోర్ట్ (SAIDS) అతడిపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో రబాడా వెంటనే తిరిగి అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆడేందుకు మార్గం సుగమమైంది.