తెలుగమ్మాయికి గోల్డ్ మెడల్

Sports Published On : Friday, May 30, 2025 11:00 AM

దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో తెలుగమ్మాయి గోల్డ్ మెడల్ కొట్టింది. భారత అథ్లెట్ జ్యోతి యర్రాజీ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భాగంగా నిన్న జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ లో 12.96 సెకన్లతో బంగారు పతకం గెలిచి, కొత్త రికార్డు సృష్టించింది. 2023లో బ్యాంకాక్లో కూడా ఆమె 13.09 సెకన్లతో బంగారం సాధించింది.