IPL తిరిగి ప్రారంభమయ్యే తేదీ ఇదే..
IPLను ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభించాలని BCCI యోచిస్తున్నట్లు సమాచారం. స్వదేశానికి వెళ్లిపోయిన ఆటగాళ్లను తిరిగి రప్పించాలని ఫ్రాంచైజీలకు చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరో 12 లీగ్ మ్యాచులు మిగిలున్నాయి. వాటిలో అహ్మదాబాద్ 3, లక్నో, బెంగళూరు చెరో 2, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, ధర్మశాల తలో మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. భద్రత కోసం ధర్మశాల మ్యాచ్ ను వేరే వేదికకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.