IPL 2025: ఫైనల్ వేదిక మార్పు..!
భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ మ్యాచ్ ల రీ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 3న నిర్వహించే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదిక మారబోతున్నట్టు సమాచారం. తొలుత ఈ మ్యాచ్ ను ఈడెన్ గార్డెన్ వేదికగా జరుపుతామని ప్రకటించింది. ఐతే ఫైనల్ మ్యాచ్ ను ఈడెన్ గార్డెన్స్ వేదిక నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియానికి మార్చబోతున్నట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.